Paddy Procurement | ధాన్యం టెండర్లు రద్దా.. గడువు పొడిగింపా?
ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది.
- ప్రభుత్వం తర్జనభర్జన
- ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు ఇచ్చిన గడువు 23తో పూర్తి
- జూన్ 6 తర్వాతే ప్రభుత్వ నిర్ణయం
- పౌరసరఫరాల సంస్థకు మరింత నష్టం
Paddy Procurement | హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): ధాన్యం టెండర్లను రద్దు చేయాలా? పౌరసరఫరాల సంస్థ విక్రయించిన ధాన్యం ఎత్తేందుకు బిడ్డర్లకు మరింత గడువు పొడించాలా? అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. గడువు పొడిగించాలంటే ముఖ్యమంత్రి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని గత ఫిబ్రవరిలో పౌరసరఫరాల సంస్థ గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించింది. టెండర్లలో పాల్గొన్న నాలుగు సంస్థలు ఈ ధాన్యాన్ని దక్కించుకున్నాయి. నిబంధనల ప్రకారం సదరు సంస్థలు మే 23 వరకు మొత్తం ధాన్యాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు 20% ధాన్యం కూడా ఎత్తకపోవడం గమనార్హం. ఈ ధాన్యం విలువ రూ.7 వేల కోట్ల వరకు ఉండగా, ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే ఎత్తినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు.
పెరగనున్న నష్టాలు
పౌరసరఫరాల సంస్థ అధికారులు, ప్రభుత్వం, బిడ్డర్లు వ్యవహరిస్తున్న తీరుతో పౌరసరఫరాల సంస్థకు వాటిల్లుతున్న నష్టాలు మరింత పెరుగుతున్నాయనే విమర్శలున్నాయి. సకాలంలో ధాన్యం ఎత్తి, అందుకు అవసరమైన డబ్బులు చెల్లిస్తే సంస్థపై ఆర్థికభారం తగ్గేది. ఇప్పుడు గడువు పొడిగించినా, రద్దు చేసినా సంస్థకు భారీ నష్టం తప్పదనే అభిప్రాయాలు పౌరసరఫరాల వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎంత ఎత్తితే అంత ధాన్యానికే డబ్బులు చెల్లించాలన్న నిబంధన పౌరసరఫరాల సంస్థను నష్టాల్లోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బిడ్డర్లలో భయం లేకుండా పోయిందని, వాళ్లకు వీలైనప్పుడు, బయట డిమాండ్‌కు అనుగుణంగా డబ్బులు చెల్లించి బియ్యం ఎత్తుతున్నారనే విమర్శలున్నాయి. ముందుగానే డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని భావిస్తున్నారు. బిడ్డర్లు ధాన్యం ఎత్తడంలో చేస్తున్న జాప్యం కారణంగా పౌరసరఫరాల సంస్థపై ప్రతి నెల సుమారు రూ.200 కోట్ల వరకు వడ్డీ భారం పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ గడువు పొడిగిస్తే ఈ వడ్డీ భారాన్ని ఎవరు భరించాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

