కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

మహబూబ్ నగర్ : ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. జిల్లాలోని హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. రైతుల నుంచి దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మళ్లీ అధిక ధరకు ప్రభుత్వానికే విక్రయిస్తున్నారని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ క్వింటాకు రూ.1,888 ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. తూకంలో ఎవరైనా మోసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కరోనాపై రైతులు జాగ్రతగా ఉండి మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్ రాజ్ , జెడ్పీటీసీ విజయ నిర్మల, సర్పంచ్ మానస, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
హత్యకేసు నిందితుడికి జీవిత ఖైదు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

