e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం

సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం

సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం

వరంగల్ : కరోనా తీవ్రంగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు. కరోనా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, వసతులపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..కోవిడ్ రాకుండా కట్టడి చేయాలి.అడిగిన వారికి టెస్ట్ లు చేయాలి. లక్షణాలు లేకున్నా, కొద్దిగా ఉన్నా పాజిటివ్ వస్తే ఇంటి దగ్గర ఐసోలేషన్‌ ఉంచేందుకు కౌన్సెలింగ్ ఇచ్చి తగిన మందులు ఇవ్వాలన్నారు. కొవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపడా ఉందా, లేదు ఎప్పటికప్పుడు చూసుకోవాలన్నారు.

అలాగే గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు కొవిడ్ పై సరైన అవగాహన కల్పించడం, ఆ స్థాయిలో అందించే వసతులు కల్పించేలా చూడాలని మంత్రులు తెలిపారు. కలెక్టర్లు.. మీ పరిధిలో ఉన్నవి మీరు చేయండి. లేనివి మా దృష్టికి తెస్తే మా ప్రయత్నం మేము చేస్తాం. మీ కృషికి మేము అండగా నిలవాలన్నదే మా తాపత్రయమని వారు స్పష్టం చేశారు.


ప్రైవేట్ హాస్పిటల్ లో చేరుకున్నది కూడా మన ప్రజలే కాబట్టి వారికి ఆక్సిజన్ సరఫరా చేసే అవకాశం ఉంటే చేయాలి. మీకు ఏ కొరత ఉన్నా మా దృష్టికి రాతపూర్వకంగా తీసుకురండి. ఆరోగ్య మంత్రి, అధికారులతో నిత్యం మాట్లాడుతున్నాం. వీలైనంత వరకు కొరత లేకుండా చేసి సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

అలాగే ఐసోలేషన్ కేంద్రాలు ఎక్కువగా పెట్టాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎన్ని విధాల అయితే అన్ని విధాలా ప్రజలను ఆదుకోవాలన్నారు. ఎంజీఎంలోని 1250 బెడ్లను పూర్తిగా కొవిడ్ హాస్పిటల్‌గా చేస్తున్నాం.


ఎంజీఎం హాస్పిటల్ లో ఆక్సిజన్ ఇబ్బంది లేదు. ఇక్కడ ఎక్కువ రోగులు చనిపోతున్నారని తప్పుడు వార్తలు వస్తున్నవి. అవి నిజం కాదన్నారు. కాగా, జనరల్ రోగులను కేఎంసీకి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. రేపటి నుంచి ఇది ప్రారంభం అవుతుందని తెలిపారు.

ఉపాధి హామీ పథకం చిన్న చిన్న గ్రూపులు చేసి పని చేయించండి. వారికి కోవిడ్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లు లేకపోతే ఫైన్ వేయడం కచ్చితంగా అమలు చేయాలి. గుంపులు, గుంపులు తిరగకుండా కట్టడి చేయాలన్నారు.

ఇవి కూడా చదవండి..

కరోనా ఉధృతిపై వరంగల్‌లో మంత్రుల సమీక్ష

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సూప‌ర్ స్టార్..!

ఇండియాకు ఆక్సిజ‌న్ కోసం ఓవ‌ర్‌టైమ్ ప‌ని చేస్తున్నాం: చైనా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం

ట్రెండింగ్‌

Advertisement