Education News | ఫిబ్రవరిలో గేట్.. 18 వరకు ‘దోస్త్’ రిపోర్టింగ్ గడువు
జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో 30 పేపర్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.
Education News | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్(గేట్) -2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో 30 పేపర్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు చివరివారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీకి అప్పగించారు. వివరాలకు https:// gate2025.iitr.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఇంకా చదవల్సిన వార్తలు…
ఎస్జీటీలకు పీఎస్‌హెచ్‌ఎం పదోన్నతులివ్వండి: తపస్
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీ చర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనలు మార్చి, బీఈడీ అర్హత గల ఎస్జీటీలకు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పదోన్నతులు కల్పించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్, కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను తపస్ ప్రతినిధి బృందం కలిసి వారికి వినతిపత్రాన్ని సమర్పించింది.
18 వరకు ‘దోస్త్’ రిపోర్టింగ్ గడువు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కాలేజీల్లో రిపోర్టింగ్ గడువును అధికారులు 18 వరకు పొడిగించారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు.
‘ఎప్‌సెట్’ వెరిఫికేషన్‌కు నేడే ఆఖరు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ఎప్‌సెట్ వెబ్‌కౌన్సెలింగ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు శనివారంతో ముగియనుంది. 15 వరకు వె బ్ ఆప్షన్లకు అవకాశముంది. శుక్రవా రం వరకు 99,170 మంది ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 19 లో పు సీట్లను కేటాయిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

