హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో నిర్మించిన గౌడ హాస్టల్ నూతన భవనాన్ని మంగళవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ప్రారంభించనున్నట్టు గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ తెలిపారు.
1952 నుంచి హిమాయత్‌నగర్‌లో కొనసాగుతున్న గౌడ హాస్టల్ భవనం విద్యార్థులకు సరిపోకపోవడం వల్ల ఉప్పల్ భగాయత్‌లో స్థలం కొనుగోలు చేసి కొత్తగా భవనాన్ని నిర్మించినట్టు పేర్కొన్నారు. హాస్టల్తోపాటుగా గౌడ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట ఉచిత శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పినట్టు చెప్పారు.