Bahadurguda | మహిళా రైతులపై నాన్‌బెయిలబుల్ కేసులు.. బహదూర్‌గూడ ఘటనలో సర్కార్ మరో దౌర్జన్యం
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50 మంది ప్రమేయం ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Bahadurguda | రంగారెడ్డి, జూలై 19 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో మహిళా రైతులపై పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు చేయగా, బీఆర్ఎస్ నేతలతో పాటు 50 మంది ప్రమేయం ఉన్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే బహదూర్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్ 28, 62లో ఉన్న 650 ఎకరాల భూమిలో కొంతకాలంగా తాము వ్యవసాయం చేసుకుంటున్నట్టుగా రైతులు చెప్తున్నారు. కాగా, ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర సర్కార్ కేటాయించింది. దీనిని ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
బాధిత రైతులు కొంతకాలంగా ఆ ప్రదేశంలో దీక్షకు దిగారు. శనివారం తెల్లవారుజామున ఈ దీక్షా శిబిరాన్ని ఎత్తివేసేందుకు పోలీసులు యత్నించగా, రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎదురుతిరుగగా, పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, బహదూర్‌గూడ, లక్ష్మీతండాకు చెందిన జటావత్ రవీందర్, జటావత్ కమ్లీ, జటావత్ మణి, గాయత్రి, మెగావత్ నీలమ్మ, ఎలుకని జ్యోతి, దేవెందర్తో పాటు మరికొంతమందిపై సెక్షన్ 133, 308-2, 121-1, బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. క్రైం నంబర్ 401లో భాగంగా కేసులు నమోదు చేశారు. కార్తీక్‌రెడ్డితో పాటు మరో 35మందిపై కేసు నమోదు చేశారు.
మరో కేసులో..
మరో ఘటనలో క్రైం నంబర్ 400లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు కార్తీక్‌రెడ్డితో పాటు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లయ్య, ఆ పార్టీ నాయకులు చిలుకమర్రి నర్సింహ, పంతంగి భూపాల్‌గౌడ్, మహేందర్, కొలను ప్రదీప్‌రెడ్డి, యాదగిరి, రాహుల్, మహేందర్‌యాదవ్, పరమేశ్వరి, వేణుగౌడ్, హరిప్రసాద్, జనార్దన్‌యాదవ్, భిక్షపతియాదవ్, యాదయ్య, శంకరమ్మ, పార్వతమ్మ, సుధా, మీనా, సరస్వతి, సుమలత, భాగ్య, యాదమ్మ, చంద్రయ్య, మహేశ్వర్‌రెడ్డి, కొర్ర దినేశ్, నర్సింగ్‌రాజు, క్యామ శ్రీకాంత్, వట్టపల్లి శ్రీనివాస్‌నాయక్, విజయ్‌కుమార్, ఏర్పుల ప్రభాకర్, వెంకటేశ్‌గౌడ్, శ్రీకాంత్, సురేందర్, మహేందర్‌పై సెక్షన్ 170తో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. దీంతోపాటు మరికొంతమందిపై కూడా అనుమానితులుగా కేసులు నమోదు చేశారు.
తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమ కండ్లల్లో కారం చల్లి, కుర్చీలు, రాళ్లు, రాడ్లతో దాడి చేశారని శంషాబాద్ ఎస్సై వనజ ఫిర్యాదు చేశారు. మరో కేసును విజయ్ అనే పోలీసు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. తమ భూముల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టి తమపైనే కేసులు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

