ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు.
- ఇద్దరి అభ్యర్థిత్వాలకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం
- సుప్రీం కోర్టు తీర్పుపైనే వీరి పదవి ఆధారం
- వ్యతిరేక తీర్పు వస్తే పదవి ఊడటం ఖాయం
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. వారి ఫైల్‌పై శనివారం సంతకం చేశారు. దీంతో ఎమ్మెల్సీ పదవులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు మంత్రి అజారుద్దీన్‌కు పదవీ గండం తప్పింది. కానీ సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగానే వీరు ఎమ్మెల్సీలుగా ఖరారవుతారని న్యాయ నిపుణు లు పేర్కొంటున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెం డింగ్ ఉన్నది. ఈ కేసు జూలై 22కు వా యిదా పడింది. బీఆర్ఎస్ సర్కార్ హ యాంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్ర వణ్ను నామినేట్ చేసి ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపించింది. వీరిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో వారి అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారి స్థానంలో కోదండరాం, అమీ ర్ అలీఖాన్ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరికి గవర్నర్ ఆమోదం తెలిపా రు.
దీనిపై దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై వి చారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరాం, అమీర్‌అలీఖాన్ అభ్యర్థిత్వాలను నిలుపుదలచేస్తూ ఆదేశాలిచ్చింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడే కొత్త ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవచ్చని న్యాయస్థా నం స్పష్టంచేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వం గతంలో ఉన్న అమీర్‌అలీఖాన్ పేరును తొలగించి కోదండరాంతోపాటు అజారుద్దీన్ పేరును ప్రతిపాదించింది. ఈ అభ్యర్థిత్వాలకు గవర్నర్ తాజాగా అమోద ముద్ర వేశారు. గతంలో కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌కు రాజకీయ నేప థ్యం ఉందనే కారణంతో వారి అభ్యర్థిత్వాలను నాటి గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ పక్కన పెట్టగా, ఇప్పుడు తెలంగాణ జన సమితి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా ఉన్న అజారుద్దీన్ అభ్యర్థిత్వాలకు నేటి గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిది రాజకీయ నేపథ్యం కాదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసు ప్రకారం వీరిద్దరికి కూడా పదవీ గండం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

