ఖైరతాబాద్, జూన్ 3 : ఓ ఆదివాసీ యువకుడికి గుండె, ఊపిరితిత్తుల మధ్య గుచ్చుకున్న బాణాన్ని విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన నిమ్స్ వైద్య బృందాన్ని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ అభినందించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు మండలం, ధర్మారం గ్రామానికి చెందిన సోది నంద అడవి పందిని వేటాడే క్రమంలో బాణం గుచ్చుకొని తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ తర్వాత యువకుడిని భద్రాచలం ఏరియా ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం దవాఖాన వైద్యుల సూచన మేరకు నిమ్స్‌కు తరలించారు. కార్డియోథోరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వర్ రావు, డాక్టర్ గోపాల్ బృందం శస్త్రచికిత్స నిర్వహించి బాణాన్ని తొలగించి యువకుడిని కాపాడారు. విషయం తెలుసుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్పతో పాటు వైద్య బృందాన్ని పిలిపించుకొని శాలువా, మెమోంటోలతో సత్కరించారు.