ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదు: బాజిరెడ్డి గోవర్దన్
ఆర్టీసీ | ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని, సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోని స్పష్టం చేశారు.

హైదరాబాద్: ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని, సంస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోని స్పష్టం చేశారు. ఆసియాలోనే నంబర్ వన్‌గా ఉన్న సంస్థ నష్టాల బారిన ఎందుకు పడిందో అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో ఆయన ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ.. రోజూ రూ.13 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం కరోనాతో రూ.3 కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇప్పుడిప్పుడే మళ్లీ పుంజుకుంటుందని, ప్రస్తుతం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. కష్టపడే తత్వమున్న సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారని చెప్పారు. సంస్థ ఆదాయాన్ని తిరిగి రూ.13 నుంచి 14 కోట్లకు చేరుస్తామన్నారు.
కరోనా తర్వాత 95 శాతం బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ఆర్టీసీకి ప్రజల ఆదరణ చాలా అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పునఃప్రారంభిస్తామన్నారు. వంద శాతం సురక్షిత ప్రయాణంతో బస్సులను నడుపుతమని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Education Commission | పదవీకాలం ముగిసినా పదవులు వీడరా? విద్యా కమిషన్ ఆఫీసే సొంత అడ్డా!
కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
KTR | రాబందు రాజ్యంలో అన్నీ బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న
Cyclone Murasu | ముంచుకొస్తున్న ‘మురసు’.. నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
Raptadu Incident | రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్లు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

