హైదరాబాద్ : విధుల నుంచి ప్రభుత్వం తొలగించిన ఆర్టిజన్ల(Artisans)ను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagdish Reddy) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాల, ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులు మంత్రిని, ట్రాన్స్‌కో, జెన్కో ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డితో కలిసి చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాస్తవానికి ఔట్ సోర్సింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్ల(Artisans)ను దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్(Chief Minister KCR)మానవతా దృక్పథంతో క్రమబద్దీకరించారని గుర్తు చేశారు. ఇటీవల సమ్మె పేరుతో విధులకు గైర్హాజరైన 196మంది ఆర్టీజన్ లను మానవీయ కోణంలోనే తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
అదే సమయలో ఈ తరహ సంఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులకు సూచించారు. పునరావృతం అయితే ఉపెక్షింది లేదని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు హెచ్చరించారు.