హైదరాబాద్, జనవరి21 (నమస్తే తెలంగాణ) : నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న సీఈ (చీఫ్ ఇంజినీర్) పోస్టుల్లో సూపరింటెండింగ్ ఇంజినీర్ల(ఎస్ఈ)ను తాత్కాలిక ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాహుల్‌బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇరిగేషన్ శాఖలో ఇటీవలనే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. మొత్తం 19 సర్కిల్స్ ఉండగా, అన్ని విభాగాల్లో కలిపి 23 సీఈ పోస్టులున్నాయి. ఇందులో ప్రస్తుతం దాదాపు 12 సీఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిలో పలు సీఈ పోస్టులకు ప్రస్తుతం ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సీఈగా కరీంనగర్ సర్కిల్-1 ఎస్ఈ సుమతీదేవి, రామగుండం సీఈగా కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ శ్రీనివాస్‌రావు గుప్తా, ఇరిగేషన్ శాఖ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ సీఈగా డిప్యూటీ ఈఎన్సీ కే శ్రీనివాస్, గజ్వేల్ సీఈగా సూర్యాపేట ఎస్ఈ ధర్మతేజ, సంగారెడ్డి సీఈగా ఎస్ఈ రాజమ్మ, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎస్ఈ విద్యావతి, హైదరాబాద్ సీఈగా రవీంద్రారెడ్డిని డిప్యుటేషన్‌పై నియమించారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 50 బీసీ కులాలను సంచార జాతులుగా బీసీ కమిషన్ నిర్ధారించింది. ప్రభుత్వానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మాయదేవి సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మినహా మిగతా అన్ని శాఖల నుంచి కమిషన్‌కు సమాచారం అందింది.