రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
Fire stations | రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాటి నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫైర్ స్టేషన్లు లేని శాసనసభ నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా, కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు.
కొత్త ఫైర్ స్టేషన్లు ఎక్కడంటే..
మల్కాజిగిరి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, అంబర్‌పేట, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

