హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీ సంస్థలపై సర్కారు కరుణచూపలేదు. ఆర్థికశాఖకు, ఇంధనశాఖకు మంత్రి భట్టి విక్రమార్క ఉన్నా కూడా డిస్కంల ఆశలు అడియాశలే అయ్యాయి. బడ్జెట్లో సబ్సిడీగా రూ. 11,500కోట్లు కేటాయించారు.
గతేడాది సబ్సిడీ కింద రూ. 11,500కోట్లే కేటాయించారు. ఈ సారి సబ్సిడీని రూపాయి కూడా పెంచలేదు. రాష్ట్రంలో రెండు విద్యుత్తు సంస్థలు రూ. 20వేల కోట్ల లోటులో ఉన్నాయి. విద్యుత్తు చార్జీలను పెంచవద్దని, లోటును పూడుస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నది. కానీ లోటును పూడ్చడంలో మొండి చెయ్యి చూపిస్తున్నది.