హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): పర్యావరణ విధ్వంసం చేస్తూ కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న హైదరాబాద్‌లో ప్రాణవాయువును అందించి, పచ్చని ప్రకృతి కేంద్రంగా ఉన్న కేబీఆర్ జాతీయ పార్కును కాపాడుకోవాల్సిన రాష్ట్ర ప్రభు త్వం… కండ్లుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేబీఆర్ పార్కు పరిధిలోని చిరాన్కుంట వి ధ్వంసం, హెచ్సిటీ ప్రాజెక్టు పేరిట జరుగుతు న్న పర్యావరణం విధ్వంసంపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ తీవ్రంగా స్పందించింది. మా నవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన కేంద్ర అటవీ శాఖ విభా గం, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖకు కీలక ఆదేశాలు జారీచేసింది. హెచ్సిటీ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై చర్యలు చేపట్టాలని, దీనిపై సమగ్ర నివేదికను సమర్పించడమే కాకుండా, ఆ నివేదిక కాపీని ఫిర్యాదుదారునికి అందజేయాలని స్పష్టం చేసింది.
నిజాం దాతృత్వానికి ప్రతీక.. చిరాన్కుంట
చిరాన్కుంట కేవలం ఒక నీటి వనరు మా త్రమే కాదు, ఇదీ తెలంగాణ చారిత్రక వారసత్వ చిహ్నం. నిజాం రాజుల దాతృత్వానికి, వారికున్న పర్యావరణ స్పృహకు సజీవ సాక్ష్యం. ఎంతో చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపదను, కేబీఆర్ పార్కు పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కాపాడటంలో సర్కార్ ఘోరంగా విఫలమైందనే ఆరోపణలొస్తున్నాయి.
నిర్వీర్యమవుతున్న జీవవైవిధ్యం
అత్యంత అరుదైన వృక్ష, జంతు జాతులకు కేబీఆర్ పార్క్ ఆవాసంగా ఉన్నది. ఇక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే హైదరాబాద్ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందులో 456 వృక్ష జాతులు, 56 రకాల అరుదైన జీవరాశులు, వివిధ రకాల సరీసృపాలు, జాతీయ పక్షి అయినా నెమళ్లకు ఆవాసంగా ఉన్నదని పేర్కొన్నారు. ఇంతటి అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను కంటికిరెప్పలా కాపాడాల్సిన బాధ్యతను రాష్ట్ర సర్కార్ విస్మరించిందని మండిపడుతున్నారు.
సుప్రీంకోర్టు సీరియస్
కేబీఆర్ పార్కు పరిరక్షణపై గతంలో సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అయినా సరే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నది. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నద నే విమర్శలున్నాయి. ఇప్పటికైనా హెచ్సిటీ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన పనులను నిలిపివేసి, నివేదికను బహిర్గతం చేయకపోతే, ఈ పర్యావరణ పోరాటం మరింత ఉధృతం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎన్‌హెచ్చార్సీ నోటీసులు
ఇటీవల కేబీఆర్ పార్కును సంరక్షించాలంటూ పెద్ద ఎత్తున్న పర్యావరణవేత్తలు చేసిన ఆందోళనను అడ్డుకునేలా పోలీసు లు చూపిన అత్యుత్సాహంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పర్యావరణవేత్తల అక్రమ నిర్బంధంపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటాగా స్వీకరించిన కమిషన్ బుధవారం రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణాన్ని కాపాడాలని కోరిన నిరసనకారులపై పోలీసులు ఈ తరహాలో వ్యవహరించడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించింది. ఈ ఘటనపై బాధ్యులైన అధికారుల తీరుపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని పోలీసు, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.