Telangana | తొలగింపులో తొందర.. విశ్రాంత ఉద్యోగుల స్థానంలో ఇన్చార్జులేరి?
ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది.
- వారం రోజులుగా ఖాళీగా కీలక స్థానాలు
- ఇన్చార్జులకు బాధ్యతలు అప్పగించడంలో సర్కారు ఆలస్యం
- నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొనసాగింపుపై పనిచేస్తూ వచ్చిన విశ్రాంత ఉద్యోగులను తొలగించిన రాష్ట్ర సర్కారు.. వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించడంలో తాత్సారం చేస్తున్నది. తొలగించిన రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో ఇన్చార్జులను నియమించకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయి, పనులు పడకేశాయి. కీలకస్థానాల్లో ఉన్నవారిని సైతం పక్కన పెట్టడంతో ఆయా శాఖల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ)నుంచి 177 మంది విశ్రాంత ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. ఆ జాబితాలో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు ఉన్నారు.
కీలక స్థానాలైనా నింపరా?
వైటీడీఏ వైస్ చైర్మన్, ఎండీ కిషన్‌రావు, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ సీఈఈ డీవీఎస్ రాజు, వాటర్‌బోర్డులో సత్యనారాయణ, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు ఇలా.. ప్రధాన శాఖల్లో కీలక వ్యక్తుల స్థానాలు ఖాళీగా ఉండటంతో కార్యకలాపాలు స్తంభించాయి. గతంలో ఏ ఉద్యోగిని అయినా తొలగిస్తే లేదా బదిలీ చేస్తే వెంటనే ఇన్చార్జిగా మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
ఉద్యోగులపై స్పష్టత కరువు
ఏదైనా శాఖలో అయినా విశ్రాంత అధికారి లేదా ఉద్యోగి సేవలు అత్యవసరం అనుకుంటే, ఆ శాఖ అధిపతి ఇచ్చే వివరణను పరిశీలించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటున్నదని మార్చి 25న సర్కారు ఇచ్చిన ఉత్తర్వులోనే తెలిపారు. తొలగించిన 6,729 మందిలో తిరిగి నియామకం అయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు పలువురు ఉంటారని సచివాలయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. కానీ వారం గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

