ఎకో టూరిజంపై అధ్యయన కమిటీ
రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల గుర్తింపు, నిర్వహణ, ఉపాధి కల్పన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఏకో టూరిజం ప్రాజెక్టుల కోసం అనువైన ప్రాంతాలు, మౌలిక వసతుల వంటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని కమిటీకి సూచించింది.
- చైర్మన్‌గా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి
- అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రాజెక్టుల గుర్తింపు, నిర్వహణ, ఉపాధి కల్పన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఏకో టూరిజం ప్రాజెక్టుల కోసం అనువైన ప్రాంతాలు, మౌలిక వసతుల వంటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని కమిటీకి సూచించింది. ఈ మేరకు అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి ఏ వాణీప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ కమిటీకి రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి చైర్మన్‌గా, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అటవీశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీశాఖ ప్రధాన పీసీసీఎఫ్, వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్, నీటిపారుదలశాఖ సెక్రటరీ, టీఎఫ్డీ కార్పొరేషన్ ఎండీ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, తెలంగాణ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రతినిధి, జూపా ర్క్ డైరెక్టర్, ఎకో టూరిజం ఈడీ, వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ ప్రతినిధి, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధి, నలుగురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
సూపరింటెండెంట్స్‌కు గెజిటెడ్ హోదా
అటవీశాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్స్‌కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం గెజిటెడ్ హోదాను కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. టీఎన్జీవోల ఫారెస్ట్ ఫోరమ్ స్టేట్ యూనియన్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

