హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటుచేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
ఎస్సీ, ఎస్టీల సవరణ బిల్లు 2013, రాజ్యాంగంలోని అధికరణ 338ఏ (3) ప్రకారం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ లంబాడీ హకుల పోరాట సమితి నగరభేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూక్యా దేవా నాయక్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై కౌంటరు దాఖలుకు నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది పి.రాంప్రసాద్ కోరారు.