హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : దొడ్డి కొమురయ్య వర్ధంతి రోజున మాజీ సీఎం రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజల ప్రతినిధి కాదని మరోసారి నిరూపించుకున్నారని గొల్లకురుమ హకుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు.
ఈ మేరకు ప్రభుత్వం తీరు సరికాదని శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.