హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): న్యాయ సంస్థల్లో ఇంగ్లిష్ భాషను విరివిగా ఉపయోగించడంతో సామాన్యులకు తగిన న్యాయం లభించడం లేదని న ల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ అధ్యయనంలో గుర్తించారు. న్యాయశాస్త్ర విద్యార్థులు అఖిల్సూర్య, లక్ష్య అనంత్, నిమిషామిశ్రా, ముస్కాన్శర్మ మేడ్చ ల్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు కోర్టుల కు వెళ్లి అక్కడి న్యాయవాదులు, ఇతర నిపుణు లు, బాధితుల అభిప్రాయాలను సేకరించారు.
ఆ రిపోర్టును శనివారం తెలంగాణ అధికార భాషా సంఘం చైర్పర్సన్ శ్రీదేవిని కలిసి అం దించారు. కోర్టుల్లో నామ ఫలకాలపై, నోటీస్ బోర్డులపై తెలుగు అమలు చేయాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. ఉత్తర్వులు, ఆర్డర్లు, తీర్పులను ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, ఉర్దూ భాషల్లోనూ జారీ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. చాలా మందికి ఇంగ్లిష్‌పై అవగాహన లేక అయోమయానికి గురవుతున్నారని వివరించారు. చదువుకుంటూనే సామాజిక అంశంపై పరిశోధన చేయడం గొప్ప విషయమని చైర్పర్సన్ కొనియాడారు.