Special Trains | అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లానికి వెళ్తాయని చెప్పింది.
Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లానికి వెళ్తాయని చెప్పింది. చర్లపల్లి-కొల్లం (07107) రైలు నవంబర్ 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ఆయా రైళ్లు ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. కొల్లం-చరల్లపల్లి (07108) రైలు నవంబర్ 19, 26, డిసెంబర్ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ప్రతి బుధవారం ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని వివరించింది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూర్, పాలక్కడ్, త్రిస్సూర్, అలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, కాయకులం స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
నర్సాపూర్ టూ కొల్లం ఇలా..
నర్సాపూర్-కొల్లం (07105) రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో రైళ్లు నడుస్తాయని.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొల్లం-నర్సాపూర్ (07106) రైలు నవంబర్ 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30 జనవరి 6, 13, 20 తేదీల్లో రైళ్లు నడుస్తాయని.. ప్రతి ఆదివారం వేకువ జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూరు, పాలక్కడ్, త్రిస్సూర్, అలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్, కాయంకులం స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.
మచిలీపట్నం నుంచి..
మచిలీపట్నం-కొల్లం (07101) రైలు నవంబర్ 14, 21, 28, డిసెంబర్ 26, జనవరి 2 తేదీల్లో రైళ్లు నడుస్తాయని ఆయా రోజల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి పదిగంటలకు గమ్యస్థానం చేరుతుంది. కొల్లం – మచిలీపట్నం (07102) రైలు నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 28, జనవరి 3 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఈ రైలు వేకువ జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది. ఈ రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కడ్, తిస్సూర్, అలువ, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, కాయంకులం స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను అయ్యప్ప భక్తులు వినియోగించుకోవాలని కోరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

