హైదరాబాద్ : ఎన్నో రోజులుగా పచ్చిరొట్ట రైతులకు ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇక ఈ రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం(Ambedkar Secretariat) ప్రారంభోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి( Minister Niranjan Reddy) తన కార్యాలయంలో విత్తనాల సబ్సిడీ(Subcidy)పై తొలి సంతకం చేశారు. అంతకు ముందు మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సబ్సిడీ విత్తనాల కోసం ప్రభుత్వం రూ. 76.66 కోట్లు వెచ్చించనుందని మంత్రి పేర్కొన్నారు. వనపర్తి నియోజకవర్గం లో చెక్ డ్యాం(Check dams)ల నిర్మాణం కోసం రెండో సంతకం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో నిర్మాణం పూర్తైన 10 చెక్ డ్యాంలు అందుబాటులోకి రాగా మరో రెండు చెక్ డ్యాంలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి అధనంగా మరో 18 చెక్ డ్యాంల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్ రావు,జడ్పీ చైర్మన్లు తదితరులు పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.