బీటెక్ స్టూడెంట్స్‌కు JNTU గుడ్ న్యూస్.. ఏడాది బ్రేక్ తీసుకుని మళ్లీ చదువుకోవచ్చు

JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార్టప్స్‌లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్టు జేఎన్టీయూ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. ఇది వరకు బీటెక్ ( BTech )లో చేరితే నాలుగేండ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. బీటెక్ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు. ఈ దశలో అటు చదువా.. ఇటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని.. చదువులకు ప్రాధాన్యమిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్టీయూ బ్రేక్ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.
JNTU new policy మార్గదర్శకాలు..
- స్టార్టప్స్ వెంచర్లు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఇందుకు అర్హులు.
- తొలి నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసినవారికే అవకాశం. బ్యాక్‌ల్యాగ్స్ ఉన్నవారికి, హాజరుశాతంలేనివారికి ఈ అవకాశం ఉండదు.
- ఆయా విద్యార్థులు జేఎన్టీయూ వీసీకి రిపోర్ట్‌చేసి, అనుమతి పొందాలి. ఏ కారణం చేత బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో వెల్లడించాలి.
- తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది.
- సంవత్సరం పూర్తికాగానే మరలా తిరిగి కోర్సులో చేరాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జేఎన్టీయూలో కొత్త కోర్సులు.. 30న గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభం
JNTU : కొలువులిచ్చే కొత్త కోర్సులు.. ఈ ఏడాది కొత్తగా 6 కోర్సులు ప్రారంభం
బీటెక్ విద్యార్థులకు రాజ్యాంగ బోధన..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- break study
- BTech
- JNTU
- JNTUH
RELATED ARTICLES
తాజా వార్తలు
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పాపన్నపేట కబడ్డీ జట్లు
Scene | సూర్య ‘సీన్’ సినిమాకు బుకింగ్స్ ఆలస్యం.. విజయ్ ప్రభుత్వం కొత్త జీవో కోసమే ఎదురుచూపులు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

