Sircilla | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 28 : సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కూతురి వివాహం కోసం ఇచ్చిన ఆర్డర్ మేరకు 200 గ్రాముల బంగారాన్ని జరీ పోగులుగా తయారు చేసి 12 రోజుల వ్యవధిలో చీరను రూపొందించాడు.
నూలు పోగులకు బంగారం జత చేసి నేసిన ఈ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, దాదాపు 900 గ్రాముల బరువు ఉంటుందని నేత కళాకారుడు తెలిపాడు. విజయ్ నూతన ఆవిష్కరణను పలువురు ప్రశంసించారు.