కోల్‌సిటీ, అక్టోబర్ 25: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువతి బీఎస్ఎఫ్లో సోల్జర్‌గా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్నది. భారత్ – బంగ్లాదేశ్ బార్డర్లో విధులు నిర్వర్తించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లింది. సుప్రిత బార్డర్లో తుపాకీ పట్టి దేశానికి రక్షణ కవచంగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా ఓ వైపు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని బైకంరాంపూర్లో ఈ నెల 10న శిక్షణ పూర్తి చేసుకొని ఔట్‌పాస్ కూడా తీసుకున్నది.