హైదరాబాద్, మే1 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో7తో నిరుపేద విద్యార్థులకు తీరని నష్టం వాటిల్లనున్నదని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నల్ల కండువాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. జీవో ప్రతులను చించివేశారు.