హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ జూనియన్ చాంపియన్షిప్ సృష్టి జూపూడి ప్రతిష్ఠాత్మక తెలంగాణ విమెన్ లీడర్స్ అవార్డును అందుకొన్నారు. ఈ అవార్డును వరల్డ్ వుమెన్ లీడర్షిప్ కాంగ్రెస్ అందజేసింది.
21 ఏండ్ల సృష్టి బిక్స్, సీఐఐకి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. సృష్టి గీతం డీమ్డ్ వర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా ఆమెను గీతం వర్సిటీ అధికారులు అభినందించారు.