కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 23 : ఓ తండ్రి కన్న కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏడాది క్రితం జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ హోటళ్ల వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్నా డు. ఆ వ్యక్తికి 12 ఏండ్ల కూతురు ఉన్నది. 8 నెలల క్రితం తన భార్యతో గొడవపడటంతో ఆమె కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి ఇటీవల అత్తగారింటికి వెళ్లాడు.
తండ్రిని చూడగానే కూతురు భయపడిపోయింది. గమనించిన బాలిక అమ్మమ్మ మనుమరాలిని గట్టిగా ప్రశ్నించింది. ఏడాది క్రితం తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయాన్ని తెలిపింది. బాధితురాలి తల్లి సోమవారం వన్ టౌన్ పోలీసులకు భర్తపై ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.