సిర్పూర్(టీ), జూన్ 17: ఆడుకుం టూ వెళ్లిన ఓ బాలిక ఇనుప కూలర్‌ను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో సోమవారం చోటుచేసుకున్నది. దుబ్బగూడ కాలనీకి చెందిన ఎల్లులే వరలక్ష్మి(12) సోమవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నది. సమీపంలోని ఇంట్లోకి వెళ్లి కూలర్ పక్కన దాక్కున్నది. ప్రమాదవశాత్తు కూలర్‌కు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించింది. తండ్రి గజానన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేశ్ తెలిపారు.