GBS Case | హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు
కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణెలో 130కిపైగా జీబీఎస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తొలి బీజీఎస్ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు.
హైదరాబాద్: కొన్నిరోజులుగా మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోల్ (GBS Case) హైదరాబాద్‌కూ వచ్చేసింది. సిద్దిపేటకు చెందిన ఓ మహిళలకు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితురాలు ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణెలో 130కిపైగా జీబీఎస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో తొలి బీజీఎస్ కేసు నమోదవడంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైన పరిస్థితి ఇదని తెలిపారు.
ఈ వైరస్ సోకిన వ్యక్తికి ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుందని, కండరాలు సైతం బలహీనంగా మారడంతో పాటు డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం, నీటి ద్వారా ఆ బ్యాక్టీరియా సోకుతుందని వెల్లడించారు. అయితే ఈ వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని, జీబీఎస్ అంటు వ్యాధి కాదని, చికిత్స పొందుతూ నయం చేసుకోవచ్చన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

