ధర్పల్లి, ఫిబ్రవరి 23: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో దారుణం చోటుచేసుకున్నది. ధనంబండ తండా కు చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం కారులో నిజామాబాద్ వెళ్తుండగా పాంగ్రా బోర్గాం సమీపంలో రోడ్డుపై ఉన్న అక్కాచెల్లెళ్లను కారు లో ఎక్కించుకుని ధర్పల్లి మండ లం డీబీ తండాకు వెళ్లే దారిలో నల్లగొండ నర్సింహస్వామి ఆలయ సమీ ప ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తండా కు చెందిన మరో ఇద్దరిని అక్కడికి పిలిపించుకున్నారు. ఈ క్రమంలో నలుగురు వారిపై లైంగిక దాడికి యత్నించగా అక్క పారిపోయింది. చెల్లెలుపై నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డారు. దుబ్బాకకు చెందిన ఓ వ్యక్తి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా సదరు యువతి ముళ్లపొదల్లో కనిపించింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.