Ganesh Immersion | హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు..
హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండో రోజూ గణేశ్ నిమజ్జనాలు (Ganesh Immersion) కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ (Hussain Sagar) వైపు బారులు తీరారు. దీంతో అబిడ్స్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్, కోరటి ఫీవర్ దవాఖాన వరకు బొజ్జ గణపయ్యలు నిలిచిపోయారు. దీంతో ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మర్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, పాతబస్తీ వైపు నుంచి పెద్ద సంఖ్యలో వినాయకులు తరలి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయానికి మొహంజా మార్కెట్ చౌరస్తాను పోలీసులు క్లియర్ చేశారు. సాధారణ వాహనాలకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై నుంచి మరికాసేపట్లో వాహనాలను వదలనున్నారు.
ఇక గురువారం అర్ధరాత్రి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. డీజే చప్పుల్లు, డప్పుల మోతలు, యువతీ యువకుల హుషారెత్తించే నృత్యాలతో గణేశ్ నిమజ్జనం కొనసాగింది. నిమజ్జనానికి పోలీసులు భారీగా బందోబస్తు కల్పించారు. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో నగరం మొత్తం నిఘా పెట్టారు. రాష్ట్ర పోలీసులతోపాటు ఆర్పీఎఫ్, రైల్వే ఫోర్స్, కేంద్ర బలగాల సేవలను వినియోగించుకున్నారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

