జఫర్‌గఢ్, జనవరి 17 : జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం సాగరంలో మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ వ్యవస్థాపకుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య తల్లి గాదె తేరోజమ్మ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. అత్యవసర పెరోల్‌పై శుక్రవారం రాత్రి ఇన్నయ్య ఇంటికి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. పోలీస్ పహారా మధ్య శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. తేరోజమ్మ మృతి చెందారనే సమాచారంతో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సాగరం గ్రామానికి చేరుకొని ఆమె మృతదేహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.