హనుమకొండ చౌరస్తా, మే 18: తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన విద్యార్థిని గడ్డం శ్రీవర్షిణి అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది. అగ్రికల్చర్, ఫార్మసీ క్యాటగిరీలో శ్రీవర్షిణి 145.26 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది.
గడ్డం కన్నయ్య-లావణ్య దంపతుల కూతురు శ్రీవర్షిణి హనుమకొండలోని ఆర్యభట్ట స్కూల్లో చదివింది. ఇంటర్ హైదరాబాద్లోని శ్రీచైతన్యలో బైపీసీ పూర్తిచేసింది. డాక్టర్ అయి ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని శ్రీవర్షిణి పేర్కొన్నది.