ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఢిల్లీలో మహిళా పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారని, కానీ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగికదాడి కేసులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
- రాహుల్‌కో న్యాయం.. బీఆర్ఎస్కు మరొకటా?
- ఒకే పార్టీకి రెండు విధానాలా?
- సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి
- మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, కూసుకుంట్ల, నోముల డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ) : ‘నిరసనల విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఆ పార్టీ ఢిల్లీలో ఒకలా తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నది. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రాహుల్‌గాంధీకి సంఘీభావం తెలిపిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారు. రాహుల్‌కు ఒక న్యాయం.. బీఆర్ఎస్కు మరొకటా?’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ ఢిల్లీలో మహిళా పోలీసులపై అనుచితంగా ప్రవర్తించారని, కానీ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగికదాడి కేసులు పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణలో సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నరో? అర్థమే కావడంలేదని దెప్పిపొడిచారు. రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో రేవంత్ దుర్మార్గాలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలపై ఆయనకు నమ్మకముంటే..‘తాను ఢిల్లీలో స్వేచ్ఛగా నిరసనలు తెలుపుతున్నట్లే తెలంగాణలోనూ స్వేచ్ఛగా ఆందోళనలు జరిగేలా ఆదేశించాలి’ అని హితవు పలికారు.
కేసులను ఉపసంహరించాలి : కూసుకుంట్ల
అసెంబ్లీ బయట నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ సర్కార్ అక్రమంగా పెట్టిన లైంగిక వేధింపుల కేసులను ఉపసంహరించుకోవాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా పోలీసుపై అనుచితంగా ప్రవర్తించిన రాహుల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు ఓట్ చోరీ చేస్తుంటే.. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కరెంట్, రైతుబంధు, కేసీఆర్ కిట్, రైతుబీమా చోరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ : నోముల
రేవంత్‌రెడ్డి నియంతృత్వ పోకడలతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి ప్రజా సమస్యలు పరిషరించడం చేతగాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఈసీ బీజేపీకి తొత్తు : ఒంటెద్దు నర్సింహారెడ్డి
పారదర్శకంగా వ్యహరించాల్సిన కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి బీజేపీకి తొత్తుగా మారారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి ఆరోపించారు. నిజమైన భారతీయ పౌరుల ఓట్లు తీసివేయడానికి హకు ఎవరికీ లేదని స్పష్టంచేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కంచర్ల కృష్ణారెడ్డి, రాంచందర్‌నాయక్, ధర్మేందర్‌రెడ్డి, పడాల సతీశ్‌కుమార్, కోట్ల మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో నిరసనలు.. తెలంగాణలో కేసులా?
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

