Konda Surekha | హనుమకొండ : రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌గానే కొండా సురేఖపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు మేము చేస్తే.. మీరు పదవులు అనుభవిస్తున్నారంటూ మంత్రి సురేఖపై ఆయన మండిపడ్డారు.
హనుమకొండలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొండా సురేఖ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను కొండా సురేఖ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రిపై ప్రతాప్ రెడ్డి అనే ఫ్రీడమ్ ఫైటర్ నిప్పులు చెరిగారు. తన సమస్య చెప్పుకుందామంటే కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కోర్టు తీర్పు ఉందని చెప్పినా కనీసం పట్టించుకోవడంలేదని కొండా సురేఖకు ప్రతాప్ రెడ్డి తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోరాటాలు మేము చేస్తే, పదవులు మీరు అనుభవిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారయన. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కొండా సురేఖను నిలదీసిన స్వాతంత్ర సమరయోధుడు
హనుమకొండలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర సమరయోధులను సన్మానించిన కొండా సురేఖ
ఈ క్రమంలో తన సమస్య చెప్పుకుందామంటే కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కోర్టు తీర్పు ఉందని చెప్పినా కనీసం పట్టించుకోవడంలేదని కొండా సురేఖపై… pic.twitter.com/QEHOh53mlo
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2025