వ్యవసాయ యూనివర్సిటీ , జూన్ 8 : నిరుద్యోగ యువత పలు రంగాల్లో ఉచిత శిక్షణకు 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) డైరెక్టర్ విజయలక్ష్మి కోరారు. బుధవారం నగరంలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తి ఉన్న అభ్యర్థులకు మొబైల్ సర్వీసింగ్, ఎలక్ట్రీషియన్, పంపు సెట్ రిపేరింగ్ , అకౌంటింగ్ ప్యాకేజీ, జీఎస్టీ, ఎంఎస్ ఆఫీస్ వంటి రంగాల్లో ఆగస్టు 10 నుంచి 40 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పించనున్నట్టు ఆమె వివరించారు. శిక్షణా అనంతరం సర్టిఫికెట్‌తోపాటు సమీప బ్యాంకులో రుణం పొందే అవకాశం ఉన్నదన్నారు. వివరాలకు www.bired.org, 040 29709295, 98490 34845, 9441068171 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.