రాష్ట్రంలో మరో విడత ఉచిత బియ్యం.. నేటి నుంచి పంపిణీ
Free Rice: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేటి నుంచి రాష్ట్రంలో మరో విడత ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో పంపిణీ షురూ
- డిసెంబర్ వరకు మనిషికి 10 కిలోల బియ్యం ఉచితం
- ప్రభుత్వంపై రూ.227.25 కోట్ల అదనపు భారం
- 90 లక్షల కార్డులతో 2.84 కోట్ల లబ్దిదారులకు ప్రయోజనం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నేటి నుంచి రాష్ట్రంలో మరో విడత ఉచిత బియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఒక మనిషికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 283.42 లక్షల లబ్ధిదారులు ఉన్నారని, వీరిలో కేంద్రం కేవలం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల మందికి మాత్రమే 5 కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందని మంత్రి చెప్పారు. మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తి వ్యయంతో ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నదన్నారు.
కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల కాలానికి PMGKAY పథకాన్ని పొడిగించినిందున.. రాష్ట్ర కార్డుదారుల కోసం ప్రభుత్వం 19,057 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా సేకరిస్తున్నదని మంత్రి గంగుల తెలిపారు. వీటికి నెలకు 75.75 కోట్ల చొప్పున మూడు నెలల్లో రాష్ట్రం అదనంగా 227.25 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
PMGKAY మొదలైనప్పటి నుంచి రాష్ట్ర సర్కారు బియ్యం కోసం అదనంగా రూ.1308 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. ఇవిగాక వలస కూలీలకు రూ.500 చొప్పున, ప్రతికార్డుకు రూ.1500 చొప్పున రెండు నెలలు అందజేసిన మొత్తం రూ.2,454 కోట్లు అయ్యిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

