హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): సామాజిక బాధ్యతలో భాగంగా విజయ డెయిరీ వెస్ట్‌మారేడ్‌పల్లి సమీపంలోని రెయిన్బో అనాధ బాలికల ఆశ్రమానికి ఉచితంగా పాలు అందజేయనున్నది. రోజుకు 20 లీటర్ల చొప్పున ఏడాదిపాటు పాలను సరఫరా చేయనున్నారు. పశు సంవర్ధశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోమవారం ఇందుకు సంబంధించిన పత్రాలను ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు.