నల్లగొండ జిల్లా చెర్వుగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీని ఢీకొన్న అనంతరం కారు సుమారు 200 మీటర్లు వెనక్కి వెళ్లినట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన వారికి నర్కెట్పల్లి అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.