సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 6 : హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో రూ.103 కోట్లతో మెన్స్, ఉమెన్స్‌కు వేర్వేరుగా నిర్మించనున్న వసతి గృహాల భవన సముదాయాల పనులకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. .ఉస్మానియా మెడికల్ కళాశాల అంటేనే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ ఉస్మానియా అంటే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో 284మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామకపత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, డీఎంఈ డాక్టర్ వాణి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్‌నాయక్, ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర, టీజీఎంఎస్ఐడీసీ ఎండీ హేమంత్ బోర్కాడే, చీఫ్ ఇంజినీర్ దేవేందర్‌కుమార్, సూపరింటెండెంట్ ఇంజినీర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.