మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన నిర్వహించారు.
- లేకుంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం : సుర్వి యాదయ్యగౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మంగళవారం ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేండ్లుగా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు.
సమస్యలు పరిష్కరించాలని ప్రజాభవన్‌లో 13 సార్లు వినతి పత్రాలు అందజేసిన స్పందించకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుంటే, వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సర్పంచుల సంఘం జేఏసీ ఉ పాధ్యక్షుడు కుర్ర వెంకటేశ్ ముదిరాజ్, కార్యదర్శి కేశపోయిన మల్లయ్య, నాయకులు మెడబోయిన గణేశ్, ఎల్లారెడ్డిగారి అరవింద్‌రెడ్డి, శారద, బోట్లుల రవి, మంగ నరసింహులు, సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

