హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతి సంస్మరణ సభను శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్నది. పీవీమార్గ్ (నెక్లెస్‌రోడ్)లోని పీవీ జ్ఞానభూమి ఆవరణలో ఉదయం 9 గంటలకు పుష్పాంజలి, ప్రార్థనలు, భజనలు, సర్వమత ప్రార్థనలు జరుగుతాయి.
అనంతరం కుటుంబ సభ్యులతో ఉదయం 10.10 గంటలకు ఛాయా చిత్ర ప్రదర్శన, 10.30కు వైద్య, రక్తదానం శిబిరాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు.