నల్లగొండ రూరల్, డిసెంబర్ 13: మానవత్వం లేని రేవంత్ సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పేర్కొన్నారు. ఆశ వర్కర్ల వేతనం పెంపు విషయంలో ఈ నెల 9న రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషన్‌కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన క్రమంలో హైదరాబాద్‌లో పోలీసులు చేసిన దాడిలో గాయపడ్డ మోత్కూర్‌కు చెందిన ఆశ కార్యకర్త రహీంబీ నల్లగొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది.
ఆమెను శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.20 వేలు అందజేశారు. దవాఖాన ఖర్చులు తానే చెల్లిస్తానని భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఉన్న 25,000 మంది ఆశ వర్కర్ల బాధను ఆర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.