హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని చిన్న కాళేశ్వ రం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.571 కోట్లు ఎందుకు ఇస్తున్నది.. ఎవరికిస్తున్నది? అని బీఆర్ఎస్ సీనియర్‌నేత, మం థని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.571 కోట్లు కాగా, 75% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలోనే పూర్తయ్యాయని చెప్పారు. కొత్త గా రూ.571 కోట్లు ఇస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటని ని లదీశారు. ప్రాజెక్టు వ్యయం పెంచారా? 25% పనులకు రూ.571 కోట్లు కేటాయిస్తున్నారా? అని నిలదీశారు. వివరాలను వెల్లడించకుండా కొన్ని పత్రికలు, చానళ్లు కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు రాస్తున్నాయని, మంత్రి శ్రీధర్‌బాబుకు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం పుట్ట మధు మీడియాతో మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును తక్షణం పూర్తి చేయాల్సిన (ఫాస్టాగ్) జాబితాలో చేర్చినట్టు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్ఈని నియమించలేదు. ఫాస్టాగ్ ప్రాజెక్టు అంటే ప్రత్యేక ఏజెన్సీ ఉండాలి. కానీ ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులు ఎవరూ లేరు. ఒక్క ఎకరం భూమికూడా సేకరించలేదు. ప్రాజెక్టుపై అధికారులు ఇప్పటి వరకు ఒక సమీక్ష కూడా చేయలేదు. ప్రాజెక్టు ముసుగులో జేబులు నింపుకోవడానికి శ్రీధర్‌బాబు ప్రయత్నిస్తున్నారు. అని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శంకర్‌లాల్, పుదరి సత్యనారాయణగౌడ్, లక్కిరెడ్డి, నర్సింహారెడ్డి, రామెళ్ల కిరణ్ పాల్గొన్నారు.