జడ్చర్ల, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ నేత, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(58) కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివదేహాన్ని మంగళవారం ఉదయం స్వగ్రామమైన తిమ్మాజిపేట మండలం ఆవంచకు తీసుకురానున్నట్టు తెలిసింది.