OSD Sumanth | మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం రాత్రి 40 నిద్రమాత్రలను మింగాడు. ఇది గమనించిన అతని కుటుంబసభ్యులు.. హుటాహుటిన వరంగల్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన హరికృష్ణపై దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్‌తో పాటు మరికొంతమందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న సుమంత్ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ లభించింది. అయితే కోర్టు కేసు విచారణకు సహకరించాలని ఆదేశించడంతో గురువారం తన న్యాయవాదులతోపా టు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన సుమంత్.. విచారణ ఎదుర్కొన్నారు. అనంతరం పిలిచినప్పుడు విచారణకు రావాలని సుమంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.