Harish Rao : అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజుల నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు (BRS party senior leader) జిట్టా బాలకృష్ణ రెడ్డి (Jitta Balakrishna Reddy) ని మాజీ మంత్రి (Former Minister) తన్నీరు హరీశ్‌రావు (Thanneer Harish Rao) పరామర్శించారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం యశోద ఆస్పత్రి వైద్యులతో హరీశ్‌రావు మాట్లాడారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా వారి కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.