దేవరుప్పుల, మార్చి 28 : దేవన్నపేట పంప్‌హౌస్‌లో మోటర్లను ఆన్ చేసి నీళ్లొదిలి చేతులు దులుపుకుంటే సరిపోదని, సకాలం లో నీళ్లివ్వకే పంటలు ఎండిపోయాయని, వెం టనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మా ట్లాడారు. ‘యాసంగి పంటలు ఎండి రైతులు గోస పడుతుంటే ఆలస్యంగా మంత్రులు వ చ్చి పంపులు ఆన్ చేసి సంబురాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన దేవన్నపేట ప్రాజెక్ట్‌ను 14 నెలల క్రితమే ప్రారంభించాల్సి ఉండగా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డా రు. బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగా మం త్రులు వచ్చి నీటినొదిలారని పేర్కొన్నారు. ఏ గ్రామం వెళ్లినా ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయని, దేవాదుల నీటి కోసం తామంతా కొట్లాడామని గుర్తు చేశారు. మంత్రులు ఆ ర్భాటంగా ప్రారంభించినా ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని చెప్పారు. దేవాదుల నీటిని ఏ డాది మొత్తం పంపింగ్ చేసే సామర్థ్యమున్నా, గత 14 నెలులుగా ప్రభుత్వం, మంత్రుల అవగాహనారాహిత్యం వల్ల రైతులు భారీగా నష్టపోయారని మండిపడ్డారు.
మూడెకరాలు.. రోజుకు పది ట్యాంకర్లు
రాజన్న సిరిసిల్ల, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఇక్కడ పొలంలో ట్యాంకర్‌తో నీళ్లు పడుతున్న రైతు పేరు సార్గు హనుమయ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన ఈయనకు ఎకరన్నర సొంత భూమి ఉండగా, మరో ఎకరన్నర కౌలుకు తీసుకున్నాడు. పోయిన యాసంగిలో వేసినట్టే ఈ యాసంగిలో వరి సాగుచేశాడు. అయితే, ఈసారి మానేరు వాగుకు నీళ్లు రాకపోవడం వల్ల భూగర్భజలాలు అడుగంటి హనుమయ్య ఆశలు ఆవిరయ్యాయి. చేతికొచ్చే వేళ ఎండుతున్న పంటను కాపాడుకునేందుకు రోజూ ట్యాంకర్లతో నీళ్లను తెస్తూ పంటకు పోస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్ రూ.800 కాగా, రోజుకు పది ట్యాంకర్లకు గానూ రూ.8 వేలు ఖర్చు చేస్తున్నాడు. ఇలా ఇప్పటి వరకు రూ.50 వేలు నీటికే ఖర్చుకాగా, మొత్తం రూ.90 వేల పెట్టుబడి అయ్యిందని హనుమయ్య వాపోతున్నాడు.
కొత్త బోరు వేస్తే దుబ్బే పడింది..
ఈ కారుపోతే, మళ్లతాప పండవా.. అన్న ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదమడూరుకు చెందిన మహిళా రైతు దుబ్బ పద్మకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ యాసంగి తనకున్న రెండు బోర్లకింద ఐదెకరాలు నాటు పెట్టాలనే సంకల్పంతో ఐదు బస్తాల ఒడ్లు నారుపోసింది. నారు పెరిగేలోపే నీటి ఎద్దడి రావడంతో పారదనే అనుమానంతో రెండెకరాలే నాటుపెట్టింది. నెల రోజుల నుంచి రెండు బోర్లు ఆగిపోస్తున్నాయి.ఎట్లయినా నాటు పెట్టిన కాడికి పంట పండించాలనే మొండిపట్టుతో వారం రోజుల క్రితం రూ.35వేలు పెట్టి కొత్త బోరు వేస్తే దుబ్బ కొట్లాడింది. నీళ్లు పడలే. పొలం ఎండిపోతుండటంతో మరో కొత్త బోరువేయాలని సంకల్పించింది. శుక్రవారం ఒకరిని పిలిచి కొబ్బరికాయతో బోర్ పాయింట్ చూపించింది. అతను చూపిన పాయింట్లో మరోసారి భగీరథ యత్నం చేయడానికి దుబ్బ పద్మ శ్రీకారం చుట్టింది. – దేవరుప్పుల
ఎండిన వరిపొలం.. రైతన్నకు భారం
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన గుగులోత్ రాజు తనకున్న ఎకరం 10 గుంటల భూమిలో వరి సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక ఎండిపోయింది. పదేండ్లలో ఎప్పుడూ సాగు నీళ్లకు కరువు రాలేదని, పంటలు ఎండిపోలేదని, బావుల అడుగు చూడలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు మళ్లీ నీటి గోస వచ్చింది. ఎకరంలో ఉన్న మక్కజొన్న సగం ఎండిపోయేలా ఉంది.. పొలం కాడికి పోబుద్ధి ఐతలేదు. పంట పశువులకు మేతైంది. రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన. బావిలో ఉన్న కొద్ది నీళ్లను మక్కజొన్నకు పారిద్దామంటే లో వోల్టేజీ సమస్యతో మోటర్లు అందుకుంటలేవు. ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలె. – గీసుగొండ
రాత్రి కరెంట్ తెచ్చిన గోస
కోనరావుపేట, మార్చి 28: రైతులకు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పొద్దంతా కరెంట్ సరిగ్గా ఉండక రాత్రిపూట పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు రాత్రిపూట పొలానికి కరెంట్ పెట్టేందుకు వెళ్లి తేలుకాటు బారిన పడి నొప్పి భరించలేక నరకయాతన అనుభవించాడు. కోనరావుపేటకు చెందిన ప ని గంగరాం (46) తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేశాడు. ఇప్పుడు పంట పొట్టదశకు రావడంతో కంటికిరెప్పలా కాపాడుకుంటున్నాడు. పొద్దంతా కరెంట్ ఉండక పోవడంతో గురువారం అర్ధరాత్రి 12గంటలకు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే తేలు కుట్టడంతో నొప్పి భరించలేక అల్లాడిపోయాడు. వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. గంగారాంను సి రిసిల్ల ఏరియా దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. పొద్దంతా కరెంట్ లేకపోవ డంతోనే రాత్రిపూట వెళ్లినట్టు తెలిపాడు.
సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం
సాగునీటి కోసం అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన ఎనుగందుల మల్లారెడ్డి తనకున్న ఐదెకరాల పంటకు సాగునీరు అందించేందుకు అష్టకష్టాలు పడుతున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఇటాచీ మిషన్‌ను తెప్పించి బావిలో పూడిక తీయిస్తున్నాడు. ఎండలు
ముదురుతున్న కొద్దీ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీరందక పంటలు ఎండి పోయాయని మల్లారెడ్డి తెలిపాడు. చెలుక పక్కనే చెరువు ఉన్నా బావిలో నీరు మాత్రం ఊరడం లేదని చెప్పాడు. బావిలో పూడికతీత కోసం రూ.3లక్షలు ఖర్చు చేసినట్టు తెలిపాడు. -చెన్నారావుపేట