హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): అన్యాయం, అధర్మాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల గొంతుకగా పోరాటం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ కార్యాలయం పై తెలంగాణ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అడ్వకేట్ ఉపేంద్ర మండిపడ్డారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసమర్థుల ఆఖరి అస్త్రమే దాడులు, హింసకు పాల్పడటమని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలను ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఉపేందర్ అభిప్రాయపడ్డారు.