హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీలో టీచర్ల సంక్షేమానికి, విశ్వవిద్యాలయం అభివృద్ధికి తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టీఏయూటీఏ) ఆవిర్భవించింది. ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా డాక్టర్ ఎం శంకర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఆర్ సాయికుమార్‌ను ఎన్నుకున్నారు. వరింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ ఓదెల సంపత్, వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ జీ సంతోష్, జాయింట్ సెక్రెటర్లుగా డాక్టర్ మధుకర్‌రావు, డాక్టర్ పీ రేవతి, కోశాధికారిగా డాక్టర్ భరత్‌భూషణ్ నియమితులయ్యారు.
‘ఔట్సోర్సింగ్’సమస్యలు పరిష్కరించాలి : చాడ
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర టూరిజంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిషరించాలని మాజీ శాసనసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.